Armstrong: బీఎస్పీ తమిళనాడు చీఫ్ హత్య కేసు.. ప్రధాన నిందితుడిని కాల్చి చంపిన పోలీసులు

BSP leader Armstrong murder accused shot dead in police custody
  • పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కాల్పులు
  • ఎదురు కాల్పులు ప్రారంభించిన పోలీసులు
  • తీవ్రంగా గాయపడిన నిందితుడిని ఆసుపత్రికి తరలించిన వైనం
  • అప్పటికే చనిపోయినట్టు వైద్యుల నిర్ధారణ
తమిళనాడు బీఎస్పీ చీఫ్ కె.ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యకేసు ప్రధాన నిందితుడు కె. తిరువేంగడాన్ని పోలీసులు కాల్చి చంపారు. ఈ కేసులో మొత్తం 11 మంది ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పోలీసు కస్టడీ నుంచి తిరువేంగడం పారిపోయే క్రమంలో వారిపై కాల్పులు ప్రారంభించాడు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఎదురు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన నిందితుడిని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు.

ఓ ప్రాంతంలో దాచిపెట్టిన ఆయుధాలను గుర్తించేందుకు విచారణలో భాగంగా తిరువేంగడాన్ని నార్త్ చెన్నైలోని ఓ ప్రాంతానికి పోలీసులు తీసుకెళ్లారు. ఈ క్రమంలో వారి నుంచి తప్పించుకున్న నిందితుడు కూరగాయాల మార్కెట్‌లోని ఓ షెడ్‌లో దాక్కున్నాడు. పోలీసులు అక్కడికి చేరుకోవడంతో కాల్పులు జరిపాడు. అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులు ప్రారంభించారు. తీవ్రంగా గాయపడిన నిందితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు తెలిపారు.

నిందితుడు ఫుడ్ డెలివరీ బాయ్‌లా వేషం మార్చి గత పది రోజులుగా పెరంబూర్ ప్రాంతంలో తిరుగుతూ ఆర్మ్‌స్ట్రాంగ్ కదలికలను గమనించినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడిపై హిస్టరీ షీట్ ఉన్నట్టు పేర్కొన్నారు. ఐదు రోజుల క్రితమే నిందితులను కోర్టు పోలీసు కస్టడీకి అప్పగించింది. కాగా, జులై 5న ఆర్మ్‌స్ట్రాంగ్‌ను ఓ గ్యాంగ్ హత్య చేసింది.
Armstrong
Thiruvengadam
Crime News
Shot Dead
Tamil Nadu

More Telugu News