పులసల సందడి షురూ.. రూ. 24 వేలు పలికిన కేజీన్నర చేప!
- గోదావరి జిల్లాల్లో పులస చేపల సందడి
- ఎర్రనీరు వస్తుండడంతో పులస చేపల రాక మొదలు
- కోనసీమ జాలరికి చిక్కిన పులస
- రూ. 24 వేలకు కొనుగోలు చేసిన మాజీ సర్పంచ్
తాజాగా గోదావరికి ఎర్రనీరు వస్తుండడంతో ఓ జాలరి వలలో పులస చిక్కింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వశిష్ఠ గోదావరిలో మలికిపురం మండలం రామరాజులంక జాలర్ల వలలో దాదాపు కేజీన్నర బరువున్న పులస చేప పడింది. ఆ వెంటనే దానిని మాజీ సర్పంచ్ బర్రే శ్రీను రూ. 24 వేలకు కొనుగోలు చేసి తీసుకెళ్లారు. పులస చేపా.. మజాకా!