Anant Ambani: రాధికా మర్చంట్ మెడలో తాళికట్టిన అనంత్ అంబానీ.. అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లి

Anant Ambani ties nuptial knot with Radhika Merchant in lavish Mumbai wedding

  • అతిరథ మహారథులతో గ్రాండ్‌గా జరిగిన పెళ్లి
  • బారాత్ ఊరేగింపుతో వివాహ వేదిక వద్దకు చేరుకున్న అనంత్ అంబానీ
  • రజనీ కాంత్, షారుఖ్ ఖాన్ సహా డ్యాన్స్ వేసిన పలువురు ప్రముఖులు

యావత్ దేశం దృష్టిని ఆకర్షించిన ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఫార్మాస్యూటికల్ దిగ్గజాలు వీరేన్, శైలా మర్చంట్‌ల కుమార్తె, తన చిన్ననాటి స్నేహితురాలైన రాధికా మర్చంట్ మెడలో అనంత్ అంబానీ శుక్రవారం రాత్రి తాళి కట్టారు. శుక్రవారం ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ వివాహ వేడుకలో ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, సినీ, క్రీడా, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.

అనంత్ అంబానీ ప్రత్యేకంగా డిజైన్ చేసిన నారింజ రంగు షేర్వానీ ధరించారు. తన నివాసం యాంటిలియా నుంచి సుందరంగా అలంకరించిన ఎరుపు రంగు కారుపై సంగీతం, నృత్యాల మధ్య ఊరేగింపుగా కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకున్నారు. అనంతరం హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. బారాత్ ఊరేగింపులో కేవలం సంప్రదాయ ఆచారాలకే పరిమితం కాలేదు. పలువురు సెలబ్రిటీలు డ్యాన్స్ చేశారు. అమెరికా నటుడు, రాపర్ జాన్ సెనా, సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, రణవీర్ సింగ్‌తో పాటు పెళ్లి కొడుకు అనంత్ అంబానీ కూడా డ్యాన్స్ వేశారు. ఇక కింగ్ షారుఖ్ ఖాన్ నీతా అంబానీతో కలిసి చేసిన డ్యాన్స్ ప్రత్యేకంగా ఆకట్టుకుంది.

జులై 14న గ్రాండ్ రిసెప్షన్..
కొన్ని నెలలుగా అనంత్ అంబానీ - రాధికా మర్చంట్‌ల వివాహానికి సంబంధించిన వేడుకలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అనేక కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి పెళ్లి ఘట్టం ముగిసింది. ఇక విందు మాత్రమే మిగిలివుంది. ఇవాళ (శనివారం) ఎంపిక చేసిన కొంతమంది సన్నిహిత అతిథులకు విందు కార్యక్రమాన్ని సిద్ధం చేశారు. రేపు (ఆదివారం) గ్రాండ్ రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు.

Anant Ambani
Radhika Merchant
Anant Ambani Wedding
Mumbai
  • Loading...

More Telugu News