Files Burning: ఫైళ్ల దహనం వ్యవహారం.... విజయవాడలోని పీసీబీ ప్రధాన కార్యాలయంలో పోలీసుల విచారణ

Police enquiry at PCB office in Vijayawada
షార్ట్స్‌లో చూడండి
ఇటీవల కృష్ణా నది కరకట్టపై ప్రభుత్వ ఫైళ్ల దహనం వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. ఆ ఫైళ్లపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(పీసీబీ) మాజీ చైర్మన్ సమీర్ శర్మ ఫొటోలు ఉన్నట్టు గుర్తించారు. దీనిపై నిగ్గు తేల్చేందుకు పోలీసులు విచారణను వేగవంతం చేశారు. 

ఇవాళ విజయవాడలోని పీసీబీ ప్రధాన కార్యాలయంలో పోలీసులు విచారణ జరిపారు. పీసీబీలోని ఏడు విభాగాల అధికారులను పోలీసులు ప్రశ్నించారు. కార్యాలయం నుంచి ఫైళ్లు బయటికి వెళ్లడంపై ప్రశ్నించారు. ఫైళ్లు, హార్డ్ డిస్కులు బయటికి వెళ్లడంలో అధికారుల పాత్రపై విచారణ చేపట్టారు. దహనం చేసిన ఫైళ్లలోని అంశాలు, వాటి ప్రాధాన్యతపై ఆరా తీశారు. ఫైళ్లలోని సమాచారంపై పీసీబీ సిబ్బంది వాంగ్మూలాలు రికార్డు చేశారు.
Go Back to Shorts
Files Burning
PCB Office
Police
Vijayawada

More Telugu News