K Kavitha: సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేసే ఛాన్స్

Kavitha may file Bail petition in SC on monday
  • సోమవారం బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం
  • న్యాయనిపుణులతో చర్చించిన కేటీఆర్, హరీశ్ రావు
  • నాలుగు నెలల క్రితం మద్యం కేసులో అరెస్టైన కవిత
ఢిల్లీ మద్యం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆమె సోమవారం బెయిల్ పిటిషన్ దాఖలు చేయవచ్చు. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీశ్ రావు న్యాయనిపుణులతో బెయిల్ పిటిషన్ అంశంపై చర్చలు జరిపారు. నాలుగు నెలలుగా ఆమె జైల్లోనే ఉన్నారు. పలుమార్లు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసినప్పటికీ ఇప్పటి వరకు బెయిల్ రాలేదు. తొలుత ఈడీ కేసులో, ఆ తర్వాత సీబీఐ కేసులో ఆమె అరెస్టయ్యారు.
K Kavitha
BRS
Supreme Court

More Telugu News