Rohit Sharma: రోహిత్ శ‌ర్మ‌కు చిన్న‌నాటి స్నేహితుల స‌ర్‌ప్రైజ్‌.. నెట్టింట‌ వీడియో వైర‌ల్!

Rohit Sharma Grand Welcome by his Childhood Friends in Mumbai
టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌కు అత‌ని చిన్న‌నాటి స్నేహితులు స‌ర్‌ప్రైజ్ చేశారు. నిన్న ముంబై వాంఖ‌డే స్టేడియంలో ఈవెంట్ త‌ర్వాత అంద‌రూ క‌లిసి హిట్‌మ్యాన్‌కు గ్రాండ్ వెల్‌క‌మ్ చెప్పారు. ప్ర‌పంచ‌క‌ప్ ట్రోఫీ అందుకునేట‌ప్పుడు రోహిత్ చేసిన ఫ‌న్నీ వాక్‌ను అనుక‌రిస్తూ సంద‌డి చేశారు. హిట్‌మ్యాన్‌ను ఎత్తుకుని, దండ వేసి త‌మ ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. వీరిలో ముంబై ఇండియ‌న్స్ ఆట‌గాడు తిల‌క్ వ‌ర్మ కూడా క‌నిపించాడు. ఈ వీడియో ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. 


Rohit Sharma
Team India
Cricket
Sports News

More Telugu News