KTR: నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకుల అరెస్టును ఖండించిన కేటీఆర్‌

KTR condemned the arrest of unemployed and student union leaders
టీజీపీఎస్‌సీ వ‌ద్ద‌ ఉద్యోగాల సాధన కోసం డిమాండ్ చేస్తున్న నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులు, వందల మంది విద్యార్థులపై పోలీసుల ద్వారా అణచివేత కార్యక్రమాలను చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. విద్యార్థుల డిమాండ్లను త‌క్ష‌ణ‌మే నెర‌వేర్చాల‌ని అన్నారు. శాంతియుతంగా నిర‌స‌న తెలియజేయాలనుకున్న విద్యార్థి నాయకులను అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. నిర్బంధించిన వారిని, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నిరుద్యోగుల‌కు బీఆర్ఎస్ అన్ని విధాల అండ‌గా ఉంటుంద‌ని తెలిపారు.
KTR
BRS
Telangana

More Telugu News