Revanth Reddy: ప్రధాని నరేంద్రమోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

CM Revanth Reddy meeting with PM Modi
  • సమావేశంలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క
  • కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై చర్చ
  • తెలంగాణ అభివృద్ధికి సహకారం అందించాలని వినతిపత్రం
ప్రధాని నరేంద్రమోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క కూడా పాల్గొన్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకారం వంటి అంశాలపై ప్రధానికి వినతిపత్రం ఇచ్చారు. అంతకుముందు, ముఖ్యమంత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.

ఉపరాష్ట్రపతిని కలవనున్న కే కేశవరావు

ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌ను ఎంపీ కే కేశవరావు కలవనున్నారు. ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. నిన్న ఏఐసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ మారిన నేపథ్యంలో తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు.
Revanth Reddy
Narendra Modi
Congress
BJP

More Telugu News