ప్రపంచకప్‌తో స్వదేశం చేరుకున్న రోహిత్ సేన.. ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం
- నేటి ఉదయం 6.05 గంటలకు న్యూఢిల్లీ ఎయిర్‌పోర్టులో దిగిన విమానం
- కప్ చేతపట్టుకుని ఎయిర్‌పోర్టు బయటకొచ్చిన రోహిత్ శర్మ, టీం సభ్యులు
- వేల మంది అభిమానుల మధ్య రోహిత్ సేనకు ఘన స్వాగతం
- కప్ చేతబూనిన క్రికెటర్లను చూసి అభిమానుల్లో హర్షాతిరేకాలు
మరోవైపు, టీమిండియాకు ఘన స్వాగతం పలికేందుకు అభిమానులు విమానాశ్రయానికి పోటెత్తారు. వేల మంది అభిమానులు, మీడియా ప్రతినిధులతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. టీం సభ్యులకు ఐటీసీ మౌర్యలో బస ఏర్పాటు చేశారు. దీంతో, టీమిండియా బస్సులో హోటల్‌కు బయలుదేరింది. నేడు రోహిత్ శర్మ బృందం తొలుత ప్రధానిని కలిసి ఆయనతో అల్పాహార విందులో పాల్గొంటారు. అనంతరం, ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్‌లో ముంబైకి బయలుదేరుతారు. నేడు సాయంత్రం అక్కడి వాంఖడే స్టేడియంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ కార్యక్రమంలో బీసీసీఐ సెక్రటరీ జై షా టీమిండియా సభ్యులకు రూ. 125 కోట్ల నగదు బహుమతిని పంపిణీ చేస్తారు.