తెలంగాణ కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామకం తాత్కాలికంగా వాయిదా
- నేతల మధ్య కుదరని ఏకాభిప్రాయం
- పరస్పర అంగీకారం అనంతరమే అధ్యక్షుడి నియామకం
- రేసులో మంత్రులు, ఎంపీలు, మాజీ ఎంపీ, ఇతర నేతలు
పీసీసీ పదవి కోసం మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, ఎంపీలు బలరాం నాయక్, సురేశ్ షెట్కార్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తదితరులు ప్రయత్నిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క కూడా ఈ పదవి కోసం అధిష్ఠానం వద్ద అడుగుతున్నారని సమాచారం.