ఆహా ట్రాక్ పైకి 'మార్కెట్ మహాలక్ష్మి' మూవీ!
- ఏప్రిల్ 19న విడుదలైన 'మార్కెట్ మహాలక్ష్మి'
- పార్వతీశం నుంచి వచ్చిన మరో కామెడీ కంటెంట్
- కథానాయికగా ప్రణి కాన్విక పరిచయం
- ఈ నెల 4వ తేదీ నుంచి ఓటీటీ తెరపైకి
అలా ఆయన చేసిన సినిమానే 'మార్కెట్ మహాలక్ష్మి'. అఖిలేశ్ కిలారు నిర్మించిన ఈ సినిమాకి, ముఖేశ్ దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 19వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, రేపటి నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాతోనే ప్రణి కాన్విక కథానాయికగా పరిచయమైంది. మొదటి సినిమానే అయినా, నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది.
పార్వతీశం సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ ఉంటాడు. కూరగాయలు అమ్మే మహాలక్ష్మిని చూడగానే మనసు పారేసుకుంటాడు. అయితే అమ్మాయికి ప్రేమ అనే మాట వింటేనే చిరాకు. ఒకవేళ ఎలాగో అలా ఆ అమ్మాయిని ముగ్గులోకి దింపుదామా అని అనుకుంటే, పార్వతీశం తండ్రి తన కొడుక్కి వచ్చే భారీ కట్నంపై భారీ ఆశలు పెట్టుకుంటాడు. అలాంటి పరిస్థితుల్లో పార్వతీశం ఏం చేశాడనేదే కథ.