Parvateesam: ఆహా ట్రాక్ పైకి 'మార్కెట్ మహాలక్ష్మి' మూవీ!

 Market Mahalakshmi Movie OTT Release Date Confirmwed
  • ఏప్రిల్ 19న విడుదలైన 'మార్కెట్ మహాలక్ష్మి'
  • పార్వతీశం నుంచి వచ్చిన మరో కామెడీ కంటెంట్ 
  • కథానాయికగా ప్రణి కాన్విక పరిచయం 
  • ఈ నెల 4వ తేదీ నుంచి ఓటీటీ తెరపైకి 

కొంతమంది ఆర్టిస్టులకు విలేజ్ నేపథ్యంలోని కథలు ..  యాసతో కూడిన పాత్రలు బాగా సెట్ అవుతాయి. అలాంటి పాత్రలతో మంచి మార్కులు కొట్టేసిన నటుడిగా పార్వతీశం కనిపిస్తాడు. 'కేరింత' సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న పార్వతీశం, అప్పటి నుంచి తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలను చేస్తూనే వెళుతున్నాడు. 

అలా ఆయన చేసిన సినిమానే 'మార్కెట్ మహాలక్ష్మి'. అఖిలేశ్ కిలారు నిర్మించిన ఈ సినిమాకి, ముఖేశ్ దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 19వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, రేపటి నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాతోనే ప్రణి కాన్విక కథానాయికగా పరిచయమైంది. మొదటి సినిమానే అయినా, నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది. 

పార్వతీశం సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ ఉంటాడు. కూరగాయలు అమ్మే మహాలక్ష్మిని చూడగానే మనసు పారేసుకుంటాడు. అయితే అమ్మాయికి ప్రేమ అనే మాట వింటేనే చిరాకు. ఒకవేళ ఎలాగో అలా ఆ అమ్మాయిని ముగ్గులోకి దింపుదామా అని అనుకుంటే, పార్వతీశం తండ్రి తన కొడుక్కి వచ్చే భారీ కట్నంపై భారీ ఆశలు పెట్టుకుంటాడు. అలాంటి పరిస్థితుల్లో పార్వతీశం ఏం చేశాడనేదే కథ. 
Parvateesam
Prani kanvika
Market Mahalakshmi

More Telugu News