ఢిల్లీ పర్యటనకు బయలుదేరిన చంద్రబాబు... రేపు ఉదయం ప్రధానితో భేటీ
- రేపు ఉదయం 10.15కు ప్రధానితో భేటీ కానున్న చంద్రబాబు
- ఏపీకి ఆర్థిక సాయం, ఇతర అంశాలను ప్రధానికి వివరించనున్న ఏపీ సీఎం
- అమిత్ షా, నిర్మలా సీతారామన్లతోనూ భేటీ
ఢిల్లీ పర్యటనకు బయలుదేరిన సీఎం
చంద్రబాబు ఈరోజు సాయంత్రం ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రాష్ట్ర పునర్నిర్మాణానికి దోహదపడే అంశాలను కేంద్రం దృష్టికి తీసుకు వెళ్తానన్నారు. రాష్ట్రాన్ని అగ్రస్థానానికి తీసుకువెళ్తామనే ఉద్దేశంతోనే ప్రజలు తమ కూటమికి 164 సీట్లు ఇచ్చారన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం అందరి బాధ్యత అన్నారు.