Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్... ఎదురుకాల్పుల్లో 11 మంది నక్సల్స్ మృతి

Encounter breaks out between police and Naxalites in Chhattisgarh
  • నారాయణపూర్ జిల్లాలో ఎదురు కాల్పులు
  • ధనంది-కుర్రేవాయ అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్
  • పోలీసులు సురక్షితంగా ఉన్నట్లు తెలిపిన ఐజీ సుందర్ రాజ్
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో 11 మంది నక్సలైట్లు మృతి చెందారు. ధనంది - కుర్రేవాయ అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ చోటు చేసుకుందని ఐజీ సుందర్ రాజ్ వెల్లడించారు. ఎదురు కాల్పుల్లో పోలీసులు సురక్షితంగానే ఉన్నట్లు తెలిపారు. ఎన్‌కౌంటర్ ఘటన జరిగిన ప్రాంతం కోఖామేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ యాంటీ నక్సలైట్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ సమయంలో ఎదురు కాల్పులు జరిగాయి.
Encounter
Police
Chhattisgarh

More Telugu News