Rahul Gandhi: రాహుల్ గాంధీపై మండిపడిన తెలంగాణ బీజేపీ నేత

Telangana BJP leader Ramchandraiah fires at Rahul Gandhi
  • హిందువుల పట్ల కాంగ్రెస్‌కు ఉన్న అభిప్రాయాన్ని రాహుల్ చెప్పారని ఆగ్రహం
  • ఇందిర, వాజపేయి, అద్వానీ, సుష్మా స్వరాజ్‌లు హుందాగా వ్యవహరించారని వ్యాఖ్య
  • దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా రాహుల్ గాంధీ మాట్లాడారని ఆగ్రహం
హిందువుల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న అభిప్రాయాన్ని రాహుల్ గాంధీ ఇప్పుడు స్పష్టంగా చెప్పారని తెలంగాణ మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ నేత రాంచందర్ రావు అన్నారు. మంగళవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ప్రతిపక్ష నేతలుగా ఇందిరాగాంధీ, వాజపేయి, అద్వానీ, సుష్మా స్వరాజ్‌లు హుందాగా వ్యవహరించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి గత రెండు పర్యాయాలు ప్రతిపక్ష హోదా రాలేదని గుర్తు చేశారు. ఇప్పుడు దేశ ప్రజల మనోభావాలు... ముఖ్యంగా హిందువుల మనోభావాలు దెబ్బతినేలా రాహుల్ గాంధీ మాట్లాడారని మండిపడ్డారు.
Rahul Gandhi
BJP
Ramchandraiah
Telangana

More Telugu News