: షరపోవా వర్సెస్ సెరేనా... విజేత ఎవరు?
ప్రెంచ్ ఓపెన్ లో రసవత్తరపోరుకు రంగం సిద్దమైంది. ఒకరు డిఫెండింగ్ ఛాంపియన్ అయితే, మరొకరు మాజీ వరల్డ్ నంబర్ వన్, టాప్ సీడ్ సెరేనా విలియమ్స్. ఒకరు క్లే కోర్టుల రాణి అయితే మరొకరు గ్రాస్ కోర్టుల రాణి. టైటిల్ నిలబెట్టుకుని తనకు తిరుగులేదని చాటాలని షరపోవా అనుకుంటుండగా, ఇంతవరకూ తనకు అందని ద్రాక్షగా మిగిలిన క్లేకోర్టు టైటిల్ దక్కించుకోవాలని సెరేనా కృతనిశ్చయంతో ఉంది.
వీరిద్దరూ పారిస్ లో జరుగనున్న ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్ లో ఈ రోజు తలపడనున్నారు. గత రికార్డులను పరిశీలిస్తే షరపోవా, సెరేనా ఇప్పటి వరకూ 15 సార్లు తలపడగా అందులో 13 సార్లు సెరేనాయే విజేత. అయితే ఇద్దరూ అసాధ్యులే! అంది వచ్చిన అవకాశాలను ఒడిసిపట్టుకోవడంలో సిద్దహస్తులే. ఫోర్ హ్యండ్, బ్యాక్ హాండ్, వ్యాలీలు, డ్రాప్ లు ఒకటేమిటి అన్నిట్లోనూ ఇద్దరూ సరిజోడీలే.
దీంతో ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ టెన్నిస్ అభిమానులకు పసందైన విందును అందించనుంది. సెమీస్ లో 11 డబుల్ ఫాల్ట్స్ చేసినా గట్టెక్కిన షరపోవా, సెమీస్ ను సులువుగా దాటేసిన సెరేనాను దాటగలదా? అన్నదే ప్రశ్న. అయితే ప్రతి మ్యాచ్ కొత్తదే. ప్రతి ప్రత్యర్ధి కొత్తే. ఈ క్రీడాకారిణుల్లో ఎవరు టైటిల్ విన్నరో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. టైటిల్ ఫేవరేట్ మాత్రం సెరేనా విలియమ్స్. మ్యాచ్ సాయంత్రం 6:30కి ప్రారంభం కానుంది.