: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు
తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. వేసవి సెలవులు మరికొద్దిరోజుల్లో ముగుస్తుండడంతో కోనేటి రాయుడు దర్శనం కోసం భక్తులు అధికంగా విచ్చేస్తున్నారు. రద్దీ నేపథ్యంలో టీటీడీ ఈ ఉదయం ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని నిలిపివేసింది. అలాగే, ఆదివారం వీఐపీ బ్రేక్ దర్శనాన్ని రద్దు చేసింది. ఇక, కాలినడకన కొండకు చేరుకునే భక్తులకు స్వామివారి దర్శనాన్ని ఈరోజు పునరుద్ధరిస్తున్నారు. వీరికి నిన్న దర్శనాన్ని నిలిపి వేసిన సంగతి తెలిసిందే. అటు అన్ని కంపార్ట్ మెంట్లలో భక్తులు నిండిపోయారు. బయట నాలుగు కిలోమీటర్ల మేర భక్తులు తిరుమలేశుని దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు.