వరల్డ్ కప్ ట్రోఫీతో రోహిత్ సేన సంబరాలు... ఫొటోలు ఇవిగో!

టీమిండియా దుమ్మురేపింది. అంతర్జాతీయ వేదికపై సత్తా చాటుతూ సగర్వంగా టీ20 వరల్డ్ కప్ ను చేజిక్కించుకుంది. ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ ఓటమిని, నిరుడు సొంతగడ్డపై ఆస్ట్రేలియా చేతిలో వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఎదురైన ఓటమిని మరిపిస్తూ... టీ20 వరల్డ్ కప్-2024 టోర్నీలో విజేతగా ఆవిర్భవించింది. దక్షిణాఫ్రికాతో హోరాహోరీగా సాగిన ఫైనల్లో టీమిండియా 7 పరుగుల తేడాతో నెగ్గి చాంపియన్ టీమ్ గా అవతరించింది. వరల్డ్ కప్ ట్రోఫీ అందుకున్న టీమిండియా ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

Team India
T20 World Cup 2024
Trophy

More Telugu News