'కల్కి' అద్భుతం: రజనీకాంత్
- ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో కల్కి 2898 ఏడీ
- మొదటి ఆట నుంచే హిట్‌టాక్ సొంతం చేసుకున్న మూవీ
- సినిమాపై సర్వత్రా ప్రశంసలు
- మూవీ చూసి 'ఎక్స్' వేదికగా ప్రశంసలు కురిపించిన రజనీకాంత్
తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా మూవీ చూసి మెచ్చుకున్నారు. 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా చిత్రం యూనిట్‌పై ప్రశంసలు కురిపించారు. కల్కి సినిమా చూశానని చెప్పిన రజనీ.. మూవీ ఎంతో అద్భుతంగా ఉందన్నారు. ఇండియన్ సినిమాని దర్శకుడు నాగ్ అశ్విన్ మరో లెవెల్‌కి తీసుకెళ్లారని ప్రశంసించారు. చిత్రం భారీ విజయం సాధించినందుకు నిర్మాత అశ్వన్ దత్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, హీరో ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకొణెతో పాటు చిత్ర బృందానికి అభినందనలు తెలియజేశారు. అలాగే సెకండ్ పార్ట్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.