తొలి రోజే రికార్డుల దుమ్ము దులిపిన ‘కల్కి 2898 ఏడీ’.. ప్రతి 10 మంది ప్రేక్షకులలో 9 మంది ఈ మూవీకే!
- ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో భారీ తారాగణంతో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’
- తొలి రోజే రూ. 100 కోట్లకు చేరువలో కలెక్షన్లు
- ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు
ఈ ఏడాది అత్యధిక ఓపెనింగ్ వసూళ్లు సాధించిన చిత్రంగా కల్కి రికార్డును సొంతం చేసుకుంది. తొలి రోజు భారత్‌లో ఏకంగా రూ.95 కోట్ల వసూళ్లు సాధించింది. ఓవరాల్‌గా నిన్న 85.15 శాతం ఆక్యుపెన్సీ సాధించింది. మ్యాట్నీ షోలలో 81.56 శాతం, ఫస్ట్ షోలలో 82.33 శాతం, సెకండ్ షోలలో 90.35 శాతం ఆక్యుపెన్సీ సొంతం చేసుకుంది. అంటే నిన్న సినిమాలు చూసిన ప్రతి 10 మందిలో దాదాపుగా 9 మంది కల్కి చూసినవారే కావడం గమనార్హం.