ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఆఫీసులో సీఐ హల్ చల్
- అపాయింట్ మెంట్ లేకున్నా నేరుగా లోపలికి
- అడ్డుకున్న భద్రతా సిబ్బందిపై ఆగ్రహం
- పవన్ వారాహి పూజ చేస్తుండగా బూట్లతో లోపలికి వెళ్లిన సీఐ
భధ్రతా సిబ్బంది ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. సదరు సీఐని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో త్రిపురాంతకం సీఐ వినోద్‌కుమార్‌ను మంగళగిరి టౌన్ సీఐగా నియమిస్తూ గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠత్రిపాఠి ఆదేశాలు జారీ చేశారు.
కాగా, సీఐ శ్రీనివాసరావు గతంలోనూ ఇలాగే దురుసుగా వ్యవహరించారని, జనసేన ఆఫీసులో పనిచేసే సిబ్బంది నివసించే అపార్ట్ మెంట్ లో తనిఖీల పేరుతో హడావుడి చేశారని విమర్శలు ఎదుర్కొంటున్నారు.