CM Chandrababu: అమ‌రావ‌తిలో పెట్టుబ‌డుల కోసం క‌ర్ణాట‌క వ్యాపార‌వేత్త‌ల‌కు చంద్ర‌బాబు సూచ‌న‌లు

CM Chandrababu Meet Karnataka Businessmen in Bengalore Airport
  •  బెంగ‌ళూరు ఎయిర్‌పోర్టులో సెంచురీ గ్రూప్ సంస్థ‌ల అధినేతలతో బాబు భేటీ
  • అమ‌రావ‌తిలో పెట్టుబ‌డుల విష‌యంపై వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రంలోగా నిర్ణ‌యం తీసుకుంటామ‌న్న‌ అశ్విని  
  • చంద్ర‌బాబును మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన క‌ర్ణాట‌క తెలుగు స‌మాఖ్య ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బెల్లం ర‌మ‌ణ‌
ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో పెట్టుబడుల కోసం సీఎం చంద్ర‌బాబు నాయుడు క‌ర్ణాట‌క వ్యాపార‌వేత్త‌ల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. చిత్తూరు నుంచి తిరుగు ప‌య‌నంలో భాగంగా బుధ‌వారం బెంగ‌ళూరులోని హెచ్ఏఎల్ ఎయిర్‌పోర్టులో ఆయ‌న కొద్దిసేపు ఆగారు. ఆ స‌మ‌యంలో సెంచురీ గ్రూప్ సంస్థ‌ల ఈడీ అశ్విని పై, ఎండీ ర‌వీంద్ర పైల‌తో చంద్ర‌బాబు భేటీ అయ్యారు. 

ఈ సంద‌ర్భంగా వారిని అమ‌రావ‌తిలో పెట్టుబ‌డులు పెట్టాల‌ని సూచించారు. అలాగే చంద్ర‌బాబును క‌ర్ణాట‌క తెలుగు స‌మాఖ్య ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బెల్లం ర‌మ‌ణ‌, ఆ రాష్ట్ర ఇంట‌ర్న‌ల్ సెక్యూరిటీ డివిజ‌న్ ఏడీజీపీ మువ్వ చంద్ర‌శేఖ‌ర్ కూడా మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఇక బాబు పిలుపు మేర‌కు అమ‌రావ‌తిలో పెట్టుబ‌డుల విష‌యంపై వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రంలోగా నిర్ణ‌యం తీసుకుంటామ‌ని సెంచురీ గ్రూప్ సంస్థ‌ల ఈడీ అశ్విని పై వెల్ల‌డించారు.
CM Chandrababu
Karnataka
Businessmen
Andhra Pradesh

More Telugu News