ఏపీ ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల విడుదల
- ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్
- జనరల్ కేటగిరీలో 80 శాతం మంది విద్యార్థుల పాస్
- వొకేషనల్లో 78 శాతం ఉత్తీర్ణత
- పరీక్షలకు దాదాపు 3.40 లక్షల మంది విద్యార్థుల హాజరు
జనరల్ కేటగిరీలో 80 శాతం, వొకేషనల్లో 78 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఇంటర్ బోర్టు అధికారులు వెల్లడించారు. ఉత్తీర్ణులైన అభ్యర్థుల మార్కుల మెమోలను జులై 1వ తేదీ నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు.
కాగా, ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ మొదటి సంవత్సరం పరీక్షలకు దాదాపు 3.40 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో కొందరు కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన వారు ఉంటే.. మరికొందరు ఇంప్రూవ్ మెంట్ కోసం రాసిన వారున్నారని అధికారులు తెలిపారు.