ఓం బిర్లాకు సీఎం చంద్ర‌బాబు శుభాకాంక్ష‌లు

వ‌రుస‌గా రెండోసారి లోక్‌స‌భ స్పీక‌ర్‌గా ఎన్‌డీఏ అభ్య‌ర్థి ఓం బిర్లా ఎన్నికైన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా శుభాకాంక్ష‌లు తెలిపారు. 

"18వ లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాకు అభినంద‌న‌లు. మన పార్లమెంటరీ సంప్రదాయాలను నిలబెట్టి, చిత్తశుద్ధితో, విజ్ఞతతో సభను నడిపించడంలో ఆయన విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అని చంద్ర‌బాబు ట్వీట్ చేశారు.

CM Chandrababu
Lok Sabha Speaker
Om Birla

More Telugu News