ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తున్నా... పార్టీ మారే ఆలోచన ఇప్పటికైతే లేదు: జీవన్ రెడ్డి
- తన ప్రమేయం లేకుండానే జరగాల్సింది జరిగిపోయిందన్న జీవన్ రెడ్డి
- పదవికి రాజీనామా చేశాక పల్లెలన్నీ తిరుగుతానని వెల్లడి
- ప్రజాభిప్రాయం మేరకు నడుచుకుంటానన్న జీవన్
ప్రజాభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. కానీ ఇప్పటి వరకు తనకు ఏ పార్టీ నుంచి పిలుపురాలేదన్నారు. బీజేపీ నుంచి కూడా ఎవరూ సంప్రదించలేదన్నారు. అయినప్పటికీ తనకు పార్టీ మారే ఆలోచన అయితే ఇప్పటి వరకు లేదన్నారు. కానీ ఆ తర్వాత ప్రజల నిర్ణయం ప్రకారం నడుచుకుంటానన్నారు.
పార్టీ నుంచి శ్రీధర్ బాబు తనతో మాట్లాడారని తెలిపారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ కూడా మాట్లాడినట్లు చెప్పారు. తాను ఈ స్టేజీలో పార్టీ నుంచి గౌరవం కోరుకున్నానని... కానీ ఈరోజు ఆ గౌరవం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నేళ్లుగా పార్టీ ప్రతి నిర్ణయాన్ని గౌరవించానన్నారు. తనకు నష్టం కలుగుతుందని తెలిసినా పార్టీ చెప్పిన చోట పోటీ చేశానని వాపోయారు.