పవన్, నాదెండ్ల, కందుల దుర్గేశ్ చేపట్టిన శాఖలపై ప్రజల నుంచి సలహాలు, సూచనలు కోరుతున్న జనసేన
- ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఎమ్మెల్యేలుగా 21 మంది విజయం
- పవన్, నాదెండ్ల, కందుల దుర్గేశ్ లకు మంత్రి పదవులు
- క్యూఆర్ కోడ్, గూగుల్ ఫారం ద్వారా సలహాలు, సూచనలు కోరుతూ జనసేన ప్రకటన
అదే సమయంలో, జనసేన తరఫున గెలిచిన నాదెండ్ల మనోహర్ పౌరసరఫరాల శాఖ మంత్రిగా, కందుల దుర్గేశ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా నియమితులయ్యారు.
ఈ నేపథ్యంలో, జనసేన నేతలు చేపడుతున్న ఆయా మంత్రిత్వ శాఖలపై ప్రజల నుంచి సలహాలు, సూచనలు కోరుతూ జనసేన పార్టీ ప్రకటన చేసింది. క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేయడం ద్వారా, లేకపోతే గూగుల్ ఫారం నింపడం ద్వారా సలహాలు, సూచనలు అందజేయవచ్చని జనసేన పేర్కొంది.
ఈ మేరకు క్యూఆర్ కోడ్ ను, గూగుల్ ఫారం (https://forms.gle/8Y3rRtY1dewPQAyH7) లింకును సోషల్ మీడియాలో పంచుకుంది.