టీమిండియా-ఆసీస్ మ్యాచ్... వర్షం ఆగింది, టాస్ పడింది!
- టీ20 వరల్డ్ కప్ లో నేడు టీమిండియా × ఆస్ట్రేలియా
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్
- టీమిండియాకు మొదట బ్యాటింగ్
ఇవాళ సెయింట్ లూసియాలో వర్షం పడడంతో మ్యాచ్ నిర్వహణపై సందేహాలు అలముకున్నాయి. అయితే వర్షం తగ్గి, మేఘాల చాటు నుంచి సూర్యుడు బయటికి రావడంతో సకాలంలోనే టాస్ వేశారు.
ఈ మ్యాచ్ కోసం టీమిండియా జట్టులో ఎలాంటి మార్పులు లేవు. ఆసీస్ కు ఇది కీలక మ్యాచ్ కావడంతో, ప్రధాన పేసర్ మిచెల్ స్టార్క్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఆస్టన్ అగర్ ను జట్టు నుంచి తప్పించారు.