టీమిండియా-ఆసీస్ మ్యాచ్... వర్షం ఆగింది, టాస్ పడింది!

ఇవాళ టీ20 వరల్డ్ కప్ లో క్రికెట్ అభిమానులకు మాంచి కిక్ ఇచ్చే మ్యాచ్ మ్యాచ్ జరగనుంది. అగ్రశ్రేణి జట్లు టీమిండియా, ఆస్ట్రేలియా సూపర్-8 మ్యాచ్ ఆడుతున్నాయి. ఈ మ్యాచ్ కు సెయింట్ లూసియాలోని డారెన్ సామీ స్టేడియం వేదిక. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. 

ఇవాళ సెయింట్ లూసియాలో వర్షం పడడంతో మ్యాచ్ నిర్వహణపై సందేహాలు అలముకున్నాయి. అయితే వర్షం తగ్గి, మేఘాల చాటు నుంచి సూర్యుడు బయటికి రావడంతో సకాలంలోనే టాస్ వేశారు. 

ఈ మ్యాచ్ కోసం టీమిండియా జట్టులో ఎలాంటి మార్పులు లేవు. ఆసీస్ కు ఇది కీలక మ్యాచ్ కావడంతో, ప్రధాన పేసర్ మిచెల్ స్టార్క్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఆస్టన్ అగర్ ను జట్టు నుంచి తప్పించారు.

T20 World Cup 2024
Team India
Australia
Toss
St Lucia

More Telugu News