రామోజీరావు సంస్మరణ సభను నిర్వహిస్తున్న ఏపీ ప్రభుత్వం
- ఇటీవల రామోజీరావు కన్నుమూత
- తీవ్ర అనారోగ్యంతో తుది శ్వాస విడిచిన ఈనాడు సంస్థల అధినేత
- విజయవాడ అనుమోలు గార్డెన్స్ లో రామోజీరావు సంస్మరణ సభ
దీనిపై ఏపీ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పందించారు. అసెంబ్లీ వద్ద ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. విజయవాడ వద్ద అనుమోలు గార్డెన్స్ లో రామోజీరావు సంస్మరణ సభ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమంపై చర్చించారని మంత్రి పార్థసారథి తెలిపారు. గతంలో ఇదే మైదానంలో ఎన్టీఆర్ శతజయంతి కార్యక్రమం నిర్వహించామని, ఇప్పుడు రామోజీ సంస్మరణ సభ కూడా ఇక్కడే ఏర్పాటు చేశామని చెప్పారు.