వాట్సప్ యాప్‌లోనే సాధారణ కాలింగ్ ఆప్షన్.. మరో సరికొత్త ఫీచర్
- త్వరలోనే వాట్సప్ యాప్ నుంచి కాలింగ్ సౌకర్యం
- ‘ఇన్-యాప్ డయలర్ ఫీచర్’ని జోడించనున్న మెటా
- వాట్సప్ నుంచి టెక్స్ట్ మెసేజ్ కూడా చేసుకునే ఛాన్స్
వాట్సప్ యూజర్ యాప్ నుంచి ఎగ్జిట్ కాకుండానే కాల్స్ చేసుకోవచ్చు, ఇందుకోసం యూజర్లు కాంటాక్ట్ బుక్‌ను యాడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదని తెలిపింది. యాప్‌లో కుడివైపున దిగువన కొత్త ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ కనిపిస్తుందని, దీనికి యాక్సెస్ ఇస్తే కాల్స్ సులభంగా చేసుకోవచ్చునని వాట్సప్‌బీటాఇన్ఫో వివరించింది. కాలింగ్‌తో పాటు మెసేజింగ్ షార్ట్‌కట్ డయలర్ స్క్రీన్ కూడా అందుబాటులోకి వస్తుందని వివరించింది. పరిశీలన కోసం ఈ ఫీచర్ ప్రస్తుతం కొంతమందికే అందుబాటులో ఉందని, రాబోయే రోజుల్లో మరింత మందికి అందుబాటులోకి వస్తుందని పేర్కొంది.