Nara Bhuvaneswari: భువ‌నేశ్వ‌రికి చంద్ర‌బాబు, లోకేశ్‌ బ‌ర్త్‌డే విషెస్‌

Happy Birthday Bhuvaneswari says Nara Chandrababu Naidu
  • నేడు నారా భువ‌నేశ్వ‌రి పుట్టిన‌రోజు
  • ప్రజలకు సేవ చేయాలనే త‌న‌ అభిరుచిని గ‌మ‌నించి ఎల్లప్పుడూ స‌హ‌క‌రించావంటూ బాబు ట్వీట్‌
  • మీకు మద్దతుగా నేను ఎల్లప్పుడూ ఉంటాను అంటూ భువ‌నేశ్వ‌రి రీట్వీట్‌
  • మీ ప్రేమ, దయ, మద్దతు నాకు గొప్ప బలం అంటూ లోకేశ్ ట్వీట్‌
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు త‌న భార్య భువ‌నేశ్వ‌రికి 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా పుట్టినరోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. "ఎల్లప్పుడూ మ‌ద్ద‌తుగా, దృఢంగా ఉంటావు. ఆఖ‌రికి చీకటి రోజులలో కూడా ఎల్లప్పుడూ నవ్వుతూ ఉన్నావు. ప్రజలకు సేవ చేయాలనే నా అభిరుచిని గ‌మ‌నించి ఎల్లప్పుడూ వంద‌కు వంద‌ శాతం స‌హ‌కారం ఇచ్చావు. జన్మదిన శుభాకాంక్షలు భువనేశ్వరి. నా సర్వస్వం నువ్వే!" అంటూ చంద్ర‌బాబు ట్వీట్ చేశారు. 

చంద్ర‌బాబు ట్వీట్‌కు స్పందించిన నారా భువ‌నేశ్వ‌రి.. "ధన్యవాదాలు అండీ. ప్రతిరోజూ మెరుగ్గా ఉండ‌టానికి మీరే నా ప్రేర‌ణ‌. ఆంధ్రప్రదేశ్ అని పిలుస్తున్న మన‌ పెద్ద కుటుంబం పట్ల మీ భక్తికి నేను గర్వపడుతున్నాను. మీకు మద్దతుగా నేను ఎల్లప్పుడూ ఉంటాను. మీరే నా సర్వస్వం" అని రీట్వీట్‌ చేశారు.  

అలాగే మంత్రి నారా లోకేశ్ కూడా త‌న త‌ల్లికి బ‌ర్త్ డే విషెస్ తెలిపారు. "పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ! మీ ప్రేమ, దయ, మద్దతు నాకు గొప్ప బలం. ప్రజలకు సేవ చేయడం, వ్యాపార చతురత, న్యాయం కోసం పోరాడడం పట్ల మీరు చూపిన‌ మీ అంకితభావంతో మాకు స్ఫూర్తినిచ్చారు. మీరు ప్రతిరోజూ మీ తెలివి, దయతో మా జీవితాలను ప్రకాశవంతం చేస్తారు. మీరు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి అమ్మ" అని లోకేశ్ ట్వీట్ చేశారు.
Nara Bhuvaneswari
Chandrababu Naidu
Nara Lokesh
Birthday Wishes
Twitter

More Telugu News