Mudragada Padmanabham: ఇక ముద్రగడ పద్మనాభరెడ్డి.. గెజిట్ నోటిఫికేషన్ జారీ

YCP Leader Mudragada Padbhanabham Changed His Name As Padmanabha Reddy
  • పిఠాపురంలో పవన్ గెలిస్తే పేరు మార్చుకుంటానని ముద్రగడ శపథం
  • పవన్ గెలవడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్
  • పేరు మార్పుకు దరఖాస్తు
  • తాజాగా పద్మనాభరెడ్డిగా పేరు మారుస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల
పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ గెలిస్తే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని సవాలు చేసిన ముద్రగడ పద్మనాభం అనుకున్నట్టే తన పేరు మార్చుకున్నారు. పిఠాపురంలో పవన్ గెలవగానే పేరెప్పుడు మార్చుకుంటున్నారంటూ సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ మొదలైంది. కొంతమంది ఆయన ఫొటో పెట్టి నామకరణ మహోత్సవం కూడా జరిపించారు.

ట్రోలింగ్‌పై స్పందించిన ముద్రగడ తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటున్నానని మీడియా ముఖంగా వెల్లడించారు. ఆ తర్వాత తన పేరును మార్చాలంటూ ఆయన ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా, ఆయన పేరును ముద్రగడ పద్మనాభం నుంచి ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చినట్టు పేర్కొంటూ గెజిట్ విడుదలైంది.

Mudragada Padmanabham
Mudragada Padmanabha Reddy
YSRCP
AP Politics

More Telugu News