BCCI: ఇంటర్వ్యూకి హాజరైన గంభీర్‌ని 3 ముఖ్యమైన ప్రశ్నలు అడిగిన బీసీసీఐ

What are your ideas regarding the coaching staff of the team BCCI asks for Head Coach post
  • ఇంటర్వ్యూకి హాజరైన గంభీర్, డబ్ల్యూవీ రామన్‌లను ప్రశ్నించిన బీసీసీఐ సలహా కమిటీ
  • వారి క్రికెట్ వ్యూహాలను తెలుసుకునే ప్రయత్నం
  • మూడు ముఖ్యమైన ప్రశ్నలు సంధించిన క్రికెట్ సలహా కమిటీ
టీమిండియా హెడ్ కోచ్ రేసులో ఉన్న మాజీ డ్యాషింగ్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ తొలి రౌండ్ ఇంటర్వ్యూ మంగళవారం పూర్తయింది. కోచ్ రేసులో గంభీర్‌కు గట్టి పోటీ ఇస్తున్న భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కోచ్ డబ్ల్యూవీ రామన్‌ కూడా ఇంటర్వ్యూకి హాజరయ్యారు. గంభీర్ వర్చువల్‌గా హాజరవగా, డబ్ల్యూవీ రామన్ ప్రత్యక్షంగా హాజరయ్యారు. క్రికెట్‌పై వారి ఆలోచనా విధానాలు, కోచ్‌గా ఎంపికైతే ఎలా వ్యవహరిస్తారనే సామర్థ్యాలను గుర్తించడమే లక్ష్యంగా బీసీసీఐ నియమించిన క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) ఇద్దరినీ పలు కీలకమైన ప్రశ్నలు అడిగింది.

బీసీసీఐ అడిగిన ప్రశ్నలు ఇవే..
1. ఒక జట్టు కోచింగ్ స్టాఫ్‌పై మీ ఆలోచనలు ఏమిటి?
2. ఒక జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కొందరు పెద్ద వయసు ఆటగాళ్లు ఉన్నప్పుడు.. ఆ జట్టు పరివర్తన దశను మీరు ఏవిధంగా ఎదుర్కొంటారు?
3. ఐసీసీ ట్రోఫీలు గెలవడంలో జట్టు వైఫల్యం, తీరికలేని షెడ్యూల్ నిర్వహణ అంశాలకు సంబంధించి వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లు, ఫిట్‌నెస్ ప్రమాణాలపై మీ అభిప్రాయాలు ఏంటి?

ఈ మూడు ప్రధానమైన ప్రశ్నలను బీసీసీఐ కమిటీ అడిగిందని ‘రెవ్‌స్పోర్ట్స్’ అనే క్రీడా వెబ్‌సైట్ పేర్కొంది. కాగా టీమిండియా హెడ్ కోచ్ పదవికి గౌతమ్ గంభీర్ ఎంపిక దాదాపు పూర్తయినట్టేనని వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్‌-2024 ట్రోఫీని కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు గెలవడంలో గౌతమ్ గంభీర్ కీలక పాత్ర పోషించాడు. దీంతో బీసీసీఐ అతడి వైపు మొగ్గుచూపుతున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి.

అయితే గంభీర్‌కి గట్టి పోటీ ఇస్తున్న డబ్ల్యూవీ రామన్ కూడా తాను కోచ్ రేసులో ఉన్నానని చెబుతున్నారు. ఇంటర్వ్యూ చాలా బాగా జరిగిందని చెప్పారు. అయితే 2011 ప్రపంచ కప్ విజేత జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న గౌతమ్ గంభీర్‌కి కోచ్ పదవి ఇచ్చినా ఫర్వాలేదని అన్నారు. గంభీర్‌ ఎల్లప్పుడూ చురుకుగా, వ్యూహాత్మకంగా ఉంటాడని అన్నారు.
BCCI
Gautam Gambhir
Cricket
Team India

More Telugu News