Payyavula Keshav: జగన్ అసెంబ్లీకి రావాలి.. సమస్యలపై మాట్లాడాలి: మంత్రి పయ్యావుల కేశవ్

Payyavula Keshav suggest YS Jagan to come Assembly
  • సమావేశాల్లో రాష్ట్ర అభివృద్ధికి, ప్రజాసంక్షేమానికి సంబంధించి అర్థవంతమైన చర్చ జరగాలన్న కేశవ్
  • చంద్రబాబు సారథ్యంలో జవాబుదారీతనంతో కూడిన పారదర్శక పాలన అందిస్తామని హామీ
  • సభలో స్వపక్షమైనా... విపక్షమైనా తామేనని వ్యాఖ్య
మాజీ ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీకి రావాలని ఆంధ్రప్రదేశ్ శాసన సభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ సూచించారు. బుధవారం ఆయన అసెంబ్లీలోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ... శాసన సభ సమావేశాల్లో రాష్ట్ర అభివృద్ధికి, ప్రజాసంక్షేమానికి సంబంధించి అర్థవంతమైన చర్చలు జరగాలని ఆకాంక్షించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన పారదర్శక పాలన అందించేందుకు కృషి చేస్తామన్నారు. జగన్ సభకు వచ్చి... ప్రజా సమస్యలపై మాట్లాడాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. ఇప్పుడు సభలో స్వపక్షమైనా... విపక్షమైనా తామే అన్నారు. ప్రజల కోసం ఏ పాత్ర పోషించడానికైనా సిద్ధంగా ఉంటామన్నారు. 

సమావేశాల నిర్వహణ, తదితర అంశాలపై సమీక్ష

బాధ్యతలు స్వీకరించిన తర్వాత, ఈ నెల 21, 22 తేదీల్లో అసెంబ్లీ నిర్వహణ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన దస్త్రాలపై సంతకాలు చేశారు. అనంతరం సమావేశాల నిర్వహణ, తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు.
Payyavula Keshav
Andhra Pradesh
YS Jagan
AP Assembly Session

More Telugu News