అమరావతి, పోలవరం నిర్మాణం పూర్తిచేయడమే మా లక్ష్యం: టీడీపీ ఏపీ చీఫ్ పల్లా

  • వైసీపీ ప్రభుత్వం విశాఖను గంజాయి రాజధానిగా మార్చేసిందని ఆరోపణ
  • నగరానికి పునర్వైభవం తెస్తామన్న ఏపీ టీడీపీ చీఫ్
  • గంజాయి నిర్మూలనకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు వెల్లడి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడం.. ఈ రెండూ తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని టీడీపీ ఏపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావు యాదవ్ పేర్కొన్నారు. ఈమేరకు మంగళవారం విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి పనులు తిరిగి ప్రారంభించామని, శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. రాష్ట్రానికి రాజధానిగా అమరావతి కాబోతోందని గర్వంగా చెబుతున్నామని అన్నారు. ఆర్థిక రాజధానిగా విశాఖను తీర్చిదిద్దుతామని వివరించారు.

దేశంలోనే నెంబర్ వన్ ఆర్థిక రాజధానిగా విశాఖను మారుస్తామన్నారు. గత ప్రభుత్వం విశాఖపట్నమే ఏపీ రాజధాని అని చెప్పి సిటీని గంజాయి రాజధానిగా మార్చేసిందని పల్లా శ్రీనివాసరావు యాదవ్ ఆరోపించారు. సిటీలో గంజాయి నిర్మూలనకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. విశాఖకు పునర్వైభవం కల్పించే బాధ్యత తమదేనని చెప్పారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్ల ఏర్పాటును ప్రజలు హర్షిస్తున్నారని పల్లా శ్రీనివాసరావు యాదవ్ వివరించారు.

Palla Srinivasa Rao
TDP AP Chief
Press Meet
Visakhapatnam
Amaravati
Polavaram Project

More Telugu News