హైదరాబాద్ లో యువతిపై కత్తితో దాడి
- ఛత్రినాకలో దారుణం..
- ప్రేమ నిరాకరించిందని కత్తితో దాడి చేసిన యువకుడు
- యువతిని ఆసుపత్రిలో చేర్పించిన పోలీసులు.. పరిస్థితి విషమం
ప్రత్యక్ష సాక్షుల వివరాలు, సీసీటీవీ కెమెరాల ఫుటేజీల సాయంతో నిందితుడిని గుర్తించిన పోలీసులు.. ఘటనా స్థలానికి దగ్గర్లోనే అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా, యువతికి ఇప్పటికే పెళ్లి అయిందని, భర్తతో విడాకులు తీసుకుని తల్లితో కలిసి ఉంటోందని చుట్టుపక్కల వారు చెప్పారు. ఉదయమే తల్లి షాపుకు వెళ్లగా.. బాధితురాలు ఆఫీసుకు వెళ్లేందుకు తయారవుతోందని వివరించారు.