నీట్ పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆసక్తికర ట్వీట్!
- దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ పరీక్ష
- గుజరాత్, బీహార్లో నీట్ పరీక్ష నిర్వహణలో అక్రమాలు
- అక్రమాలు జరిగిన మాట నిజమేనని ఒప్పుకున్న మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
ఇదిలాఉంటే.. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలు, ఫలితాల వెల్లడిలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నీట్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని మొదట వాదించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. అక్రమాలు జరిగిన మాట నిజమేనని తాజాగా అంగీకరించారు. నీట్ అక్రమాలు గుజరాత్, బీహార్లో వెలుగుచూడటం.. అక్కడ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలే అధికారంలో ఉండటం రాజకీయంగానూ చర్చనీయాంశమవుతోంది.