రబీ సీజన్ లో కరవు పరిస్థితిని పరిశీలించేందుకు ఏపీకి వస్తున్న కేంద్ర బృందం
- రబీ సీజన్ లో కరవు
- రితేశ్ చౌహాన్ నేతృత్వంలో 10 మంది సభ్యుల బృందం ఏపీకి రాక
- కరవు జిల్లాల్లో మంగళవారం నుంచి శుక్రవారం వరకు పర్యటన
ఈ బృందంలో 10 మంది సభ్యులు ఉన్నారు. వీరు మూడు చిన్న బృందాలుగా విడిపోయి క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడి వాస్తవ పరిస్థితులు తెలుసుకోనున్నారు. కేంద్ర బృందం ప్రకాశం, అనంతపురం, నెల్లూరు, కర్నూలు, శ్రీ సత్యసాయి, నంద్యాల జిల్లాల్లో పర్యటించనుంది.