Gomti River: నదిలో దూకి ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. కాపాడి ప్రియుడి చెంప పగలగొట్టిన మత్స్యకారుడు.. వీడియో ఇదిగో!

Fisherman Saved Lover Who Jumped Into Gomti River Then Slapped
షార్ట్స్‌లో చూడండి
నదిలోకి దూకి ఆత్మహత్యకు యత్నించిన ప్రేమజంటను కాపాడిన ఓ మత్స్యకారుడు ఆపై ప్రియుడి చెంప పగలగొట్టాడు. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో జరిగిందీ ఘటన. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొత్వాలి నగరంలోని గోలాఘాట్ వద్ద గోమతి నదిలోకి ఓ జంట దూకడం చూసిన అక్కడే ఉన్న మత్స్యకారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఓ మత్స్యకారుడు నదిలోకి దూకి వారిని రక్షించి బయటకు తీసుకొచ్చాడు. 

ఆ వెంటనే అతడు ప్రేమికుడి చెంప పగలగొట్టాడు. అతడు చేసిన పనికి ఆగ్రహంతో ఊగిపోయిన మత్స్యకారుడు జీవితం ఎంత విలువైనదో చెబుతూ మూడు, నాలుగు సార్లు బలంగా చెంపపై కొట్టడం వీడియోలో కనిపించింది. ఆ తర్వాత ఒడ్డుకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. యువతి కొంత అస్వస్థతకు గురైంది. అయితే, వారి ప్రాణాలకు వచ్చిన ముప్పేమీ లేదని, ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.
Go Back to Shorts
Gomti River
Uttar Pradesh
Fishermen
Golaghat

More Telugu News