Mouse Jiggler: పనిచేస్తున్నట్టు ఏమార్చేందుకు ‘మౌస్ జిగ్లింగ్’.. ఉద్యోగులపై వేటు

Bank Wells Fargo Terminate Employees Who Did Mouse Jiggling
  • విధుల్లో లేకున్నా మౌస్ జిగ్లింగ్‌తో మోసం
  • ఉద్యోగుల తీరుపై బ్యాంక్ వెల్స్ ఫార్గో ఆగ్రహం
  • ఏమార్చే ప్రయత్నం చేసిన ఉద్యోగుల తొలగింపు 
విధుల్లో ఉన్నట్టు కంపెనీని ఏమార్చేందుకు ప్రయత్నించి ‘మౌస్ జిగ్లింగ్’కు పాల్పడిన ఉద్యోగులపై అమెరికా చెందిన బ్యాంక్ వెల్స్ ఫార్గో వేటేసింది. వర్క్ ఫ్రం హోంలో ఉంటూ బయట పనులు చూసుకునేందుకో, మరో దాని కోసమే బయటకు వెళ్లాల్సి వచ్చిన సమయంలో వారంతా ‘మౌస్ జిగ్లింగ్’కు పాల్పడుతూ కంపెనీని మోసం చేస్తున్నట్టు గుర్తించి ఈ నిర్ణయం తీసుకుంది.

మౌస్ జిగ్లింగ్ అంటే?
సాధారణంగా కంప్యూటర్‌పై పనిచేస్తున్నప్పుడు ఎక్కువ సేపు స్క్రీన్‌ను వాడకుండా ఉంటే అది స్లీప్‌మోడ్‌లోకి వెళ్తుంది. అంటే మనం పనిచేయడం లేదని అర్థం. పనిచేయకపోయినా కంప్యూటర్ స్లీప్‌మోడ్‌లోకి వెళ్లకుండా మౌస్ జిగ్లర్ నియంత్రిస్తుంది. ఇది మన ప్రమేయం లేకుండానే మౌస్ కర్సర్‌ను కదిలిస్తూ కంప్యూటర్ స్లీప్ మోడ్‌లోకి వెళ్లకుండా నియంత్రిస్తుంది. ఇంటి నుంచి పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులు విధుల్లో ఉండగా పనిమీద ఎక్కువ సేపు బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు దీనిని ఉపయోగిస్తున్నారు. మౌస్ జిగ్లింగ్‌కు పాల్పడుతూ ఉద్యోగులు మోసానికి పాల్పడుతున్నట్టు గుర్తించిన కంపెనీ వారిని తొలగించింది. కాగా, ఈ మౌస్ జిగ్లర్‌కు కర్సర్‌ను మాత్రమే కదిలిస్తాయి. మెసేజ్‌లకు స్పందించడం, కాల్స్‌లో పాల్గొనడం వంటివి చేయవు.
Mouse Jiggler
Mouse Jiggling
America
Wells Fargo

More Telugu News