తెలంగాణ బీజేపీ కార్యాలయం వద్ద ఎన్ఎస్‌యూఐ ఆందోళన... ఇరువర్గాల మధ్య తోపులాట

NSUI dharna at Telangana BJP office
  • నీట్ ఎగ్జాంలో కుంభకోణం జరిగందంటూ ఎన్ఎస్‌యూఐ కార్యకర్తల ఆందోళన
  • ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు
  • మోదీ డౌన్ డౌన్ అంటూ ఎన్ఎస్‌యూఐ నినాదాలు
  • రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ బీజేపీ కార్యకర్తల నినాదాలు
హైదరాబాద్‌లోని తెలంగాణ బీజేపీ కార్యాలయం వద్ద శనివారం మధ్యాహ్నం ఉద్రిక్తత చోటు చేసుకుంది. నీట్ ఎగ్జాంలో భారీ కుంభకోణం జరిగిందంటూ ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలు నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో బీజేపీ కార్యకర్తలు వారిని అడ్డుకునే ప్రయత్నాలు చేశారు.

ప్రతిగా రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కాసేపు ఇరువర్గాలు పోటాపోటీ నినాదాలతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు బీజేపీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలను అక్కడి నుంచి తీసుకువెళ్లారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది.
Go Back to Shorts
BJP
Telangana
NSUI
Congress

More Telugu News