ప్రజాదర్బార్ నిర్వహించిన నారా లోకేశ్
- ఉండవల్లిలోని తన నివాసంలో మంగళగిరి ప్రజలతో భేటీ
- నియోజకవర్గ సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి
- సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ
నారా లోకేశ్ ప్రజలకు అందుబాటులో ఉండరంటూ 2019లో వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు. అయితే, అప్పుడు గెలిచిన వైసీపీ నేత ఐదేళ్లూ పత్తాలేకుండా పోయారు. ఓటమి పాలైన లోకేశ్ మాత్రం నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నారు. తన స్వంత నిధులతో నియోజకవర్గంలో 29 సంక్షేమ కార్యక్రమాలను అమలుచేశారు. దీంతో ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారు. ఈ క్రమంలోనే ప్రజలకు మరింత చేరువగా వెళ్లేందుకు ప్రజాదర్బార్ నిర్వహించాలని లోకేశ్ నిర్ణయించారు. నియోజకవర్గంలో ఉన్నపుడు ప్రతిరోజూ ప్రజాదర్బార్ కొనసాగుతుందని ప్రకటించారు. ప్రజానేతగా లోకేశ్ వేసిన ఈ తొలిఅడుగు రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులకు మార్గదర్శకం కానుంది.
