నాలో సగం, నా ప్రాణం... చంద్రబాబు గారు: నారా భువనేశ్వరి

Nara Bhuvaneswari emotional post
  • నేడు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు
  • సోషల్ మీడియాలో నారా భువనేశ్వరి ఎమోషనల్ పోస్టు
  • చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారని వెల్లడి
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇవాళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో, చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి సోషల్ మీడియాలో ఆసక్తికరంగా స్పందించారు. చంద్రబాబు సీఎం హోదాలో సంతకాలు చేస్తున్న ఫొటోను పంచుకున్నారు. 

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న నాలో సగం, నా ప్రాణం నారా చంద్రబాబునాయుడు గారు అంటూ ఎమోషనల్ గా ట్వీట్ చేశారు. 

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక చంద్రబాబు చేసిన తొలి సంతకం... రాష్ట్ర ప్రగతికి, ప్రజా సంక్షేమానికి సంకేతం అని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. ఇచ్చిన హామీ మేరకు ఐదు ఫైళ్లపై సంతకాలు చేసి మాట నిలబెట్టుకున్నారని తెలిపారు.
Go Back to Shorts
Nara Bhuvaneswari
Chandrababu
Chief Minister
TDP
Andhra Pradesh

More Telugu News