Chandrababu: సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు... మెగా డీఎస్సీపై తొలి సంతకం

Chandrababu takes charge as Chief Minister of Andhra Pradesh
  • సచివాలయంలో కోలాహలం
  • సాయంత్రం 4.41 గంటలకు సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు
  • ఎన్నికల్లో ఇచ్చిన హామీల ఫైళ్లపై సంతకాలు
టీడీపీ అధినేత చంద్రబాబు వేదమంత్రాల నడుమ ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్ లో ఉన్న చాంబర్ లో ఈ సాయంత్రం 4.41 గంటలకు చంద్రబాబు సీఎంగా బాధ్యతలు అందుకున్నారు. చంద్రబాబు, నారా భువనేశ్వరి దేవుడి చిత్రపటాల వద్ద కొబ్బరికాయలు కొట్టారు.

అనంతరం, చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన ముఖ్యమైన హామీలకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేశారు. చంద్రబాబు తన తొలి సంతకం... మెగా డీఎస్సీ ఫైలుపై చేశారు.  ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై రెండో సంతకం చేశారు. పెన్షన్ ను రూ.4 వేలకు పెంచే ఫైలుపై మూడో సంతకం చేశారు. నాలుగో సంతకం... అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ ఫైలుపై చేశారు. ఐదో సంతకం... నైపుణ్య గణన (స్కిల్ సెన్సస్) ఫైలుపై చేశారు.

కాగా, సీఎం చాంబర్ లో చంద్రబాబుకు టీడీపీ అగ్రనేతలు, అధికారులు, విద్యార్థినులు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రాష్ట్ర సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా కూడా శుభాకాంక్షలు తెలిపారు.

మెగా డీఎస్పీలో భాగంగా 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో ఎస్జీటీ పోస్టులు 6,371... స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 7,725... టీజీటీ పోస్టులు 1,781... పీజీటీ పోస్టులు 286, పీఈటీ పోస్టులు 132, ప్రిన్సిపల్స్ పోస్టులు 52 ఉన్నాయి. 
Chandrababu
Chief Minister
TDP
Andhra Pradesh

More Telugu News