సచివాలయానికి బయల్దేరిన చంద్రబాబు... దారిపొడవునా అఖండ స్వాగతం
- ఈ సాయంత్రం 4.41 గంటలకు బాధ్యతలు చేపట్టనున్న చంద్రబాబు
- అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన ప్రజలు
- చంద్రబాబుపై పూల వర్షం కురిపించిన రైతులు, మహిళలు
- దారిపై గులాబీ పూలు పరిచి అభిమానం చాటుకున్న వైనం
రైతులు చంద్రబాబు వెళ్లే దారి మొత్తం గులాబీ పూలు పరిచి తమ అభిమానం చాటుకున్నారు. గజమాలతోనూ చంద్రబాబుకు స్వాగతం పలికారు. నినాదాలతో హోరెత్తించారు. చంద్రబాబు ఈ సాయంత్రం 4.41 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్ లో ఉన్న చాంబర్లో సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.