Bandi Sanjay: మీ పట్టుదల, సంకల్పం మీకు విజయాన్ని అందించాయి: పవన్ పై బండి సంజయ్ ప్రశంసలు

ఏపీ మంత్రిగా జనసేనాని పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేయడంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఏపీ మంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కల్యాణ్ కు హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు ట్వీట్ చేశారు. 

"మీ పట్టుదల, సంకల్పమే మీకు ఈ విజయాన్ని అందించాయి. మీరు ఇలాగే ఎదగాలని, విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. కేంద్రంలో ప్రధాని మోదీ నాయకత్వంలో, రాష్ట్రంలో చంద్రబాబు సారథ్యంలో ఏపీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండనుంది. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో ఏపీ ప్రగతికి ఎలాంటి ఢోకా లేదు" అంటూ బండి సంజయ్ పేర్కొన్నారు.
Bandi Sanjay
Pawan Kalyan
AP Ministsr
BJP
Janasena
Andhra Pradesh
Telangana

More Telugu News