‘సిగ్గు లేదా?’.. పాకిస్థాన్ పేసర్ షాహీన్ అఫ్రిదీపై ఆగ్రహ జ్వాలలు
- స్వదేశంలో మండిపడుతున్న క్రికెట్ ఫ్యాన్స్
- అమెరికా, భారత్ చేతిలో ఓటములపై సోషల్ మీడియాలో నెటిజన్ల ఫైర్
- షాహీన్ అఫ్రిదీ ‘టిక్‌టాక్’ వీడియోపై మండిపాటు
పాకిస్థాన్ ఓటమి పాలైన మ్యాచ్‌ను చూసి ఆనందపడుతున్నావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా టిక్‌టాక్ వీడియోలో అఫ్రిదీ తన బ్యాటింగ్‌ను చూసుకొని సంతోషపడ్డాడు. వీడియోలో నవ్వుతూ కనిపించాడు. అఫ్రిదీ పక్కన ఉన్న ఓ వ్యక్తి ఈ వీడియోను షూట్ చేశాడు. టిక్‌టాక్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోపై పాక్ క్రికెట్ అభిమానులు రగిలిపోతున్నారు. ‘‘ఇది సిగ్గులేని ప్రవర్తన. అమెరికాపై మ్యాచ్‌లో ఒక్క వికెట్ తీయలేదు. ఓటమిలో నీదే ప్రధాన పాత్ర. అయినప్పటికీ మ్యాచ్‌ను ఎలా ఎంజాయ్ చేస్తున్నావ్? దాని గురించి ‘టిక్‌టాక్’ కూడానా’’ అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించాడు. మరికొందరు అభిమానులు కూడా అఫ్రిదీని దూషించారు. సోషల్ మీడియాలోనే కాకుండా మాజీ క్రికెటర్లు సైతం పాక్ జట్టుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
కాగా అమెరికాపై మ్యాచ్‌లో పాక్ సంచలన రీతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పాక్ ఛేజింగ్ చేయగా అఫ్రిదీ 16 బంతుల్లో 23 పరుగులు బాదాడు. ఇందులో 2 సిక్సర్లు ఉన్నాయి. ఇక 4 ఓవర్లు బౌలింగ్ చేసిన అఫ్రిదీ 33 పరుగులు సమర్పించుకున్నాడు. కాగా అమెరికా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ సూపర్ ఓవర్‌గా మారడంలో అఫ్రిదీ కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లినప్పటికీ పాక్ ఓటమిపాలైన విషయం తెలిసిందే.