రవితేజ 75వ సినిమా ప్రారంభం .. రిలీజ్ చేసేది అప్పుడే!
- రవితేజ కథానాయకుడిగా 75వ సినిమా
- మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్లో నడిచే కథ
- కథానాయికగా సందడి చేయనున్న శ్రీలీల
- దర్శకుడిగా భాను భోగవరపు పరిచయం
ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఈ రోజునే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. రెగ్యులర్ షూటింగును కూడా మొదలెట్టేసింది. కెరియర్ పరంగా రవితేజకి ఇది 75వ సినిమా. సితార నాగవంశీ - సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో దర్శకుడిగా భాను భోగవరపు పరిచయమవుతున్నాడు.
మాస్ యాక్షన్ జోనర్లో ఈ సినిమా రూపొందనుంది. కంటెంట్ కి ఇచ్చిన కామెడీ టచ్ కూడా గట్టిగానే ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం ఇతర తారాగణం ఎంపిక ప్రక్రియ కూడా నడుస్తుందని చెబుతున్నారు. భీమ్స్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.