జలపాతంలో జారిపడి హైదరాబాదీ యువకుడి మృతి
- కర్ణాటకలోని హెబ్బె జలపాతం వద్ద ప్రమాదం
- విహారయాత్ర కోసం హైదరాబాద్ నుంచి వెళ్లిన యువకులు
- సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో బండరాయిపై పడడంతో తీవ్ర గాయాలు
కెమ్మనగుండిలోని హెబ్బె జలపాతం చూసేందుకు వచ్చిన స్నేహితులు.. అక్కడ ఫొటోలు తీసుకుంటూ సరదాగా గడిపారు. ఇటీవలి వర్షాలకు జలపాతం వద్ద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో నీటి మధ్యలో ఉన్న రాళ్లపై శ్రవణ్, అతని స్నేహితుడు సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు. కాలుజారడంతో ఇద్దరూ నీటిలో పడిపోయారు. నీళ్లలోని రాయి తగిలి శ్రవణ్ కు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడున్న వారు ఈ స్నేహితులు ఇద్దరినీ ఒడ్డుకు చేర్చి పోలీసులకు సమాచారం అందించారు. అంబులెన్స్ తో వచ్చిన పోలీసులు వారిద్దరినీ వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే శ్రవణ్ చనిపోయాడని వైద్యులు తెలిపారు.