అమిత్ షా నుంచి ఫోన్... ఈటలకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి...?
- అసోం సీఎంను కలవాలని ఈటలకు అమిత్ షా సూచన
- హిమంత బిశ్వశర్మతో సమావేశమైన ఈటల రాజేందర్
- బీజేపీ అధ్యక్ష బాధ్యతల అంశం చర్చకు వచ్చినట్లుగా కథనాలు
అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మను కలవాలని ఈటలకు సూచించారు. దీంతో కాసేపటి క్రితం ఈటల రాజేందర్ అసోం సీఎంను కలిశారు. కేంద్రమంత్రి పదవి ఆశించి భంగపడిన ఈటలకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయమై హిమంత బిశ్వతో జరిగిన భేటీలో చర్చకు వచ్చినట్లుగా ప్రచారం సాగుతోంది. ఈటల రేపు అమిత్ షాను కలిసిన అనంతరం ఈ అంశంపై స్పష్టత రానుంది.